లక్ష్యానికి చేరువలో మరుగుదొడ్ల నిర్మాణం

Fri,May 24, 2019 08:42 AM

TOILETS CONSTRUCTION TO REACH TAEGET IN VIKARABAD

వికారాబాద్‌ : గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్ల నిర్మాణం కోస ప్రత్యేక చర్యలు తీసుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో స్వచ్ఛ బారత్‌ మిషన్‌ పథకంలో భాగంగా మరుగు దొడ్డి నిర్మించుకుంటే రూ.12 వేలు ప్రభుత్వం ప్రోత్సహకంగా ఇవ్వడంపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగహన కల్పించి మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు.దౌల్తాబాద్‌ మండల వ్యాప్తంగా 5948 మరుగుదొడ్లు 32 గ్రామ పంచాయతీలకు మంజూరయ్యాయి.

మంజూరైన మరుగుదొడ్లకు ప్రభుత్వం రూ.2 కోట్లా 31 లక్షల 30 వేలు విడుదల చేయడంతో ఆయ గ్రామాలకు సంబంధించి మరుగుదొడ్ల నిధులను పంచాయతీల అకౌంట్స్‌లో జమ చేశారు. ప్రతి గ్రామానికి ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేసేందుకు మండలానికి ఓ నోడల్‌ అధికారిని, గ్రామాల్లో అయితే కన్స్‌ట్రక్షన్‌ కమిటీ, శానిటేషన్‌ కమిటీలను ఏర్పాటు చేసి వాటి నిర్మాణాలను వేగవంతంగా చేపడుతున్నారు.మంజూరైన వాటిలో 70 శాతం నిర్మాణ దశలో ఉన్నాయి. సురైపల్లి, తిమ్మారెడ్డిపల్లి, గుండేపల్లి, మాటూర్‌ తదితరల గ్రామాల్లో 80 శాతం మరుగుదొడ్లను లబ్ధిదారులే స్వయంగా నిర్మించుకున్నారు.

అందరి సహకారం ఉంటే ..


గ్రామస్తులందరి సహకరం ఉంటే మరుగుదొడ్లు నిర్మాణ లక్ష్యన్ని చేరుకుంటాం. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజల్లో అవగహన కల్పిస్తాం. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటాం. మరింత అవగాహన కల్పించి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం చేరుకుంటాం.
-అంతారం సర్పంచ్‌ శ్రీకాంత్‌రెడ్డి

లక్ష్యం దిశగా అడుగులు వేస్తాం

ఆత్మాభిమనాన్ని కాపాడుకోవడానికి మహిళలు తప్పకుండా మరుగుదొడ్డి వాడాలి. బహిర్భూమికి వెళ్లాలంటే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడతారు. కాబట్టి ఖచ్చితంగా టీవీ. మొబైల్‌ కంటే మరుగుదొడ్డి నిర్మాణం తప్పని సరి. మారుముల గ్రామాల ప్రజలను చైతన్య పరిచే విధంగా చర్యలు తీసుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం.
-ఎంపీడీవో నర్సింహారెడ్డి రెడ్డి, దౌల్తాబాద్‌

1355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles