తేనెటీగలు దాడి చేయడంతో తాటిచెట్టు నుంచి పడి వ్యక్తి మృతి

Mon,May 20, 2019 08:07 PM

toddy worker died on toddy tree after honey bees attacked him in nalgonda dist

నల్లగొండ: తేనెటీగలు దాడి చేయగా వాటి నుంచి తప్పించుకునే క్రమంలో తాటిచెట్టు మీది నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని మాల్ మండలంలోని మదనాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనాపురం గ్రామానికి చెందిన మోగుతాల అక్రమ్(44) రోజు వారీగా గ్రామశివారులోని తాటి చెట్లను ఎక్కి కల్లుగీస్తుండగా చెట్టు సమీపంలో ఉన్న తీనెటీగలు ఆయనపై దాడి చేశాయి. వాటి బారి నుంచి తప్పించుకోబోయిన అక్రమ్.. కాలుజారి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి కార్మికులు అతడిని చికిత్స నమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

4283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles