ఈ రోజు మీ రాశి ఫలాలు

Sat,May 20, 2017 06:34 AM

Todays horoscopes

మేషం : ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. చెప్పుడు మాటలు నమ్మద్దు. పెట్టుబడులకు అనుకూలం

వృషభం : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం కొలిక్కి వస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఆలోచనతో పనులు చేయాలి.

మిథునం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో, గృహ, భూ సంబంధ లావాదేవాలలో జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీ శతృవుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

కర్కాటకం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం, ఏదైనా అడ్డంకి ఎదురవడం జరగవచ్చు. అనవసర వివాదాలు వద్దు. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త.

సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కోసం లేదా కుటుంబసభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యూనికేషన్‌కు అనుకూలం.

కన్య : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహ సంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకుంటారు. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు కొలిక్కివస్తాయి.

తుల : ఈ రోజు ఆరోగ్యం, ఆహారం, ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూలం కాదు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు.

వృశ్చికం : పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆందోళనకు, ఆవేశానికి గురికావద్దు. ప్రశాంతంగా ఉంటే అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.

ధనుస్సు : అనుకూలమైన రోజు. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను, లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పనిచేయడానికి బద్దకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు అనుకూలం. పెట్టుబడులు వద్దు.

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఆలోచించి మాట్లాడండి. ఆవేశం పనికిరాదు.

మీనం : బద్ధకాన్ని వీడాలి. పని వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయ, ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలో గొప్పలకు పోతే నష్టపోతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త.

4609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS