నేడు బేగంబజార్‌ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన

Wed,January 24, 2018 06:42 AM

Today will Lays Foundation stone to Begumbazar fish market

హైదరాబాద్ : బేగంబజార్‌లో అత్యాధునిక చేపల మార్కెట్‌ను నిర్మించనున్నారు. రూ.5.25 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా చేపల మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. జాతీయ మత్య్స అభివృద్ధి సంస్థ రెండున్నర కోట్లు, మిగిలిన మూడు కోట్ల రూపా యలను జీహెచ్‌ఎంసీ వెచ్చించనుంది. సెల్లార్‌లో పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో హోల్‌సేల్ దుకాణాలు, కోల్డ్ స్టోరేజ్, మొదటి అంతస్తులో చేపల కట్టింగ్, రిటైల్ వ్యాపారాల నిమిత్తం నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఈ చేపల మార్కెట్‌ను అధునిక వసతులతో నిర్మించడం వలన మార్కెట్‌లో చేపల అమ్మకాలు, ప్రాసెసింగ్‌ను నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మార్కెట్ నిర్మాణం పూర్తైతే మత్స్యకారులకు ఎంతో సౌకర్యవంతంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ చేపల మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చేపల మార్కెట్ నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం శంకుస్థాపన చేసేందుకు గాను మత్స్య శాఖ అధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

1759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS