నేడు బడిబాటలో స్వచ్ఛ పాఠశాల

Mon,June 17, 2019 07:39 AM

today swachh school conducted on behalf of badi bata

హైదరాబాద్: పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో బడిబాట నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ స్వచ్ఛ పాఠశాలలో భాగంగా తరగతి గదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణను శుభ్రం చేయనున్నారు. చెట్ల సంరక్షణ, చెట్లకు నీరుపోయడం, చెట్ల బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం చేస్తారు.

18న బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే బాలకార్మిక నిర్మూలనాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికాధికారులను భాగస్వాములను చేయడం, పాఠశాల యాజమాన్య కమిటీతో సమావేశం నిర్వహించడం చేస్తారు. 19న ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలపై ప్రచారం.. మాతృభాష, ఆంగ్ల భాషలో విద్యాబోధన తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.

1125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles