నేడు, రేపు ఎండల తీవ్రత ఎక్కువే..

Wed,June 20, 2018 08:02 AM

Today and tomorrow is the high intensity of the sun

-నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు
-ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో అక్కడక్కడా వానలు


హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. బుధ, గురువారాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు నెమ్మదించడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కాస్త పెరిగినట్టు పేర్కొన్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర పెరిగినట్టు వెల్లడించింది.

అత్యధికంగా హన్మకొండలో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, భద్రాచలంలో 38.8, ఆదిలాబాద్, రామగుండంలో 38, మెదక్‌లో 37.7, నల్లగొండలో 36.8, హైదరాబాద్‌లో 35.7, నిజామాబాద్‌లో 35.4, ఖమ్మంలో 35.3, మహబూబ్‌నగర్‌లో 34.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు. ఈ రెండింటి ప్రభావంతో రెండురోజులు అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన్నారు.

2110
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles