‘పడిపోయా’ పాటకు నిజంగానే పడిపోయింది..వీడియో వైరల్

Thu,May 16, 2019 06:59 PM

ప్రస్తుతం సోషల్‌మీడియాలో టిక్ టాక్ యాప్ ఏ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాటలు, సినిమా డైలాగ్స్, కామెడీ ఇలా అన్ని సన్నివేశాలను ఇమిటేట్ చేస్తూ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఆసక్తికరంగా ఉంటుండగా..మరికొన్ని ఫన్‌గా సాగిపోతుంటాయి. అయితే తాజాగా ఓ యువతి టిక్‌టాక్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


సందీప్ కిషన్ నటించిన డీకే బోస్ సినిమాలోని నే పడిపోయా..పడిపోయా అంటూ వచ్చే పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఓ యువతి ఇదే పాటను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేసి కంగుతిన్నది. నే పడిపోయా..పడిపోయా అంటూ పాట ప్లే అవుతుండగా..ఆ యువతి మెట్లపైకి వస్తూనే నిజంగానే కింద పడిపోయింది. పడిపోయా..పడిపోయా అంటూ నిజంగానే పడిపోయావా తల్లి అంటూ వీడియోకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

6424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles