వినాయక నిమజ్జనం.. 21వేల మంది పోలీసులతో బందోబస్తు

Wed,September 11, 2019 03:17 PM

tight security for Ganesh Immersion in Hyderabad says CP Anjani Kumar

హైదరాబాద్‌ : నగరంలో వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ స్పష్టం చేశారు. మొహరం వేడుకలు కూడా ప్రజల సహకారంతో ప్రశాంతంగా జరిగాయి. అదే విధంగా నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పారు. 21 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపామని చెప్పారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీసు ఫోర్స్‌తో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 17 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. 35 గంటల పాటు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది.

జీహెచ్‌ఎంసీ సమన్వయంతో సీపీ ఆఫీస్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం. 11,198 విగ్రహాలకు జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేశాం. ప్రతీ పోలీసు స్టేషన్‌లో పర్యవేక్షణ బృందం ఉంటుంది. 3 లక్షలకు పైగా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్న సీపీ.. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 261 సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. ఖైరతాబాద్‌ గణేష్‌ కోసం 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. నిమజ్జన ప్రక్రియలో భాగంగా ఏమైనా సమస్యలు వస్తే 9490616555 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని సీపీ సూచించారు.

693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles