పెద్దపులి హంతకుల అరెస్ట్

Sun,January 27, 2019 09:55 PM

tiger murderers arrested by mancherial forest officials

మంచిర్యాల: మందమర్రి పట్టణంలోని రామన్‌కాలనీలో లభ్యమైన పులి చర్మం కేసు చిక్కుముడి వీడింది. ఇందులో మంచిర్యాల జిల్లా శివ్వారం గ్రామానికి చెందిన దండవేణి సాయిలు అనే వ్యక్తి పులిని హతమార్చినట్లు తేలిందని అటవీ అధికారులు వెల్లడించారు. ఈమేరకు అతడికి సహకరించిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జేవీ రావు తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపులి కేసులో శుక్రవారం దండవేణి సాయిలును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పులిని మతమార్చిన ప్రాంతమైన శివ్వారంలో అవయవాలను, నమూనాలను సేకరించారు. పులి హత్యకేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణుల హతమార్చేందుకు విద్యుత్ తీగలను అమర్చగా ఆ తీగలకు పెద్దపులి తగిలి మరణించిందని వారు తెలిపారు. ఇందులో శివ్వారం గ్రామానికి చెందిన తోకల బుచ్చిరాజం, తోకల మల్లయ్య పాత్ర కూడా ఉందని సాయిలు చెప్పినట్లు వెల్లడించారు.

ఈమేరకు పెద్దపులి చర్మం వలిచిన ప్రదేశం, కరెంట్ తీగలు అమర్చిన స్థలం, పులి కాళ్లను పడేసిన స్థలంతో పాటు పులి గోర్లను దాచిన స్థలాన్ని కూడా నిందితుడు దంతవేణి సాయిలు శుక్రవారం చూపించాడన్నారు. మందమర్రి రామన్‌కాలనీకి చెందిన అయిలవేణి అంజయ్య పులి చర్మాన్ని విక్రయించేందుకు మంచిర్యాలకు చెందిన నర్సింగోజుల రవీందర్, పెద్దపల్లి జిల్లాకు చెందిన మేకల నర్సయ్య, మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన బిచుపల్లి కొమురయ్య, గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన పూర్ణ, మందమర్రి రామన్‌కాలనీకి చెందిన అయిలవేణి సాగర్ సహకారం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఇందులో మేకల నర్సయ్య, బీచుపల్లి కొమురయ్య, నర్సింగోజుల రవీందర్, దండవేణి సాయిలును ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎఫ్‌డీఓ జేవీ రావు తెలిపారు.

2433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles