గాలిలోకి కాల్పులు జరిపి.. 6.70 లక్షల నగదు చోరీ

Wed,January 16, 2019 07:49 PM

thugs robbed wine shop owners in jangaon district

జనగామ: జిల్లాలోని కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలోని తిరుమల వైన్స్ సిబ్బందిని మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నాటు తుపాకితో బెదిరించి రూ.6.70 లక్షలు దోపిడీ చేసిన సంఘటన కలకలం సృష్టించింది. బాధితుల కథనం ప్రకారం మొండ్రాయి తిరుమల వైన్స్‌లో పనిచేసే రమేశ్, భాస్కర్, శ్రీను మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత దుకాణం మూసివేసి ముగ్గురు ఒకే మోటార్ సైకిల్‌పై పాలకుర్తికి బయలుదేరారు.

మార్గమధ్యలో రామన్నగూడెం వద్ద వీరి బైక్‌ను అటకాయించిన గుర్తుతెలియని వ్యక్తులు తమ వద్ద ఉన్న నాటు తుపాకి చూపి బెదిరించి, గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి మద్యం దుకాణం ద్వారా వచ్చిన ఆదాయం రూ.6.70 లక్షలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ మధుసూధన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పాలకుర్తి సీఐ రమేశ్ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

2381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles