అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి మూడేండ్ల జైలు

Thu,April 25, 2019 06:57 AM

Three years imprisonment Behaved abusively employee

ఖైరతాబాద్ : సరదాగా గడిపేందుకు ఐమాక్స్‌కు స్నేహితురాలితో వచ్చిన ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి నాంపల్లి కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2016 డిసెంబర్ 29న నగరానికి చెందిన ఓ బాలిక తండ్రితో కలిసి ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె స్నేహితురాలితో కలిసి పిల్లల ఆటవిడుపు కోసం ఏర్పాటు చేసిన మిర్రర్ హౌజ్‌లోకి వెళ్లింది. అందులో పనిచేస్తున్న రతన్ ఆనంద్ సదరు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె... విషయం తల్లిదండ్రులకు వివరించగా, వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె స్నేహితురాలిపట్ల కూడా అదే విధంగా రతన్ ఆనంద్ వ్యవహరించాడని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, విచారణ అనంతరం నేరం రుజువు కాగా, నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అతనికి మూడేండ్ల శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

1600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles