బాసర: నడుస్తున్న రైలు నుంచి దిగేందుకు యత్నించిన ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటన వివరాల్లోకి వెళితే బాసర రైల్వేస్టేషన్లో అజంతా ట్రైన్లో వెళ్లాల్సిన ఆర్జీయూకేటీ విద్యార్థులు పొరపాటున పర్భని ట్రైన్ ఎక్కారు. పొరపాటు గ్రహించి కదులుతున్న పర్భనీ రైలు నుంచి దిగుతున్న క్రమంలో ముగ్గురు విద్యార్థులు కిందపడ్డారు. రైలు నుంచి కిందపడటంతో వరంగల్ జిల్లాకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన రైల్వే పోలీసు సిబ్బంది, ఆర్జీయూకేటీ అధికారులకు సమాచారం అందించారు.