రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

Wed,April 24, 2019 10:16 PM

three students died in bike accident in warangal rural dist

-వరంగల్ అర్బన్ జిల్లా పంథిని వద్ద దుర్ఘటన
-మృతులంతా స్నేహితులే..

వరంగల్ అర్బన్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటన ఐనవోలు మండలం పంథిని గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై నర్సింహరావు కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన మామిండ్ల అదిత్య(20) బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బిక్కినేని మురళీధర్‌రావు(19) మైనింగ్ డిప్లామాను పాల్వంచలోని కేఎల్‌ఎం కాలేజ్‌లో, వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి గొడిశాల రామ్‌సాయి(18) కూడా అదే కాలేజీలో మైనింగ్ డిప్లోమా చదువుతున్నాడు. వీళ్లు ముగ్గురూ స్నేహితులు.

వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన రామ్‌సాయి, మురళీధర్‌రావు ఇద్దరు బుధవారం పాల్వంచలోని కేఎల్‌ఎం కాలేజ్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ లో తమను దింపాలని ఆదిత్యను కోరడంతో అతడు వాళ్లను తన బైక్ పై తీసుకెళ్లాడు. వీరు ముగ్గురు బైక్‌పై బయల్దేరారు. వరంగల్ వైపు వెళ్తుండగా.. పంథిని శివారులో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో అదిత్య, రామ్‌సాయి తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు. మురళీధర్‌రావును చికిత్స కోసం స్థానికులు 108 వాహనంలో వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులంతా స్నేహితులు కావడంతో వర్ధన్నపేట, ఇల్లంద గ్రామాల్లో విషాదం అలుముకుంది. సమాచారం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎంజీఎంకు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

2535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles