ముగ్గురు పంచాయతీ సెక్రటరీల సస్పెన్షన్

Thu,April 25, 2019 10:26 PM

three panchayat secretaries suspended in suryapet dist

- కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరు, స్వచ్ఛభారత్ మిషన్ పనుల అలసత్వమే కారణం
- ఉత్తర్వులు జారీ చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్

సూర్యాపేట: జిల్లాలో ముగ్గురు పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అమయ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో చింతలపాలెం మండలం దొండపహాడ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎస్.కె.సైదులు, మోతె మండలం సిరికొండ గ్రామ ఇన్‌చార్జి పంచాయతీ సెక్రటరీ కె.వేణుగోపాల్‌రెడ్డి, కూడలి గ్రామ ఇన్‌చార్జీ సెక్రటరీ వై.వెంకయ్యలు ఉన్నారు. మే నెల చివరి నాటికి జిల్లాలో 100 శాతం మరుగుదొడ్లను నిర్మించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సూర్యాపేట జిల్లాను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.

అందులో భాగంగా గురువారం కలెక్టర్ అమయ్‌కుమార్ మండలాల వారీగా స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా గ్రామాల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్ల ప్రగతిని తెలుసుకోవడం కోసం ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఈ ముగ్గురు పంచాయతీ సెక్రటరీలు గైర్హాజరు కావడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం, గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో పనితనం, పర్యవేక్షణ సరిగ్గా లేనందుకు వీరిని సస్పెండ్ చేశారు.

3004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles