రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Mon,March 25, 2019 08:57 PM

Three killed in road accident

ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఏఎస్‌ఐ జీ రవి కుమార్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రాగి వీరేశం (78), ఆయన భార్య సరోజన (76), కరీంనగర్‌లో నివాసముండే వీరేశం కూతురు కొండూరి పద్మ (51), అల్లుడు కొండూరి మనోహర్ (56)తో కలిసి జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోటకు కారులో బయల్దేరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న మనోహర్, ముందు సీట్లో కూర్చున్న వీరేశం అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక కూర్చున్న సరోజన, పద్మ తీవ్రంగా గాయపడగా, కరీంనగర్‌లోని దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ పద్మ మృతి చెందింది. మూడు మృతదేహాలను కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రవి వివరించారు.

3754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles