రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Sat,January 12, 2019 04:50 PM

Three killed in road accident

భద్రాద్రి కొత్తగూడెం/మహబూబ్‌నగర్: జిల్లాలోని అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామ సమీపంలో ముత్యాలమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బస్సును బైక్ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రామన్నగూడెం గ్రామానికి చెందిన దుర్గారావు(25), పాపారావు(21)గా గుర్తించారు.

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ప్రైవేటు బస్సు ఢీకొనడంతో రబ్బానీ(50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజాపూర్ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

1434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles