ఏసీబీ వలలో చిక్కిన పలువురు అధికారులు

Tue,May 28, 2019 06:28 PM

Three govt officers is in ACB custody

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల అవినీతి నిరోధకశాఖ అధికారులు నేడు జరిపిన రైడ్‌లో పలువురు అధికారులు ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. నగరంలోని మియాపూర్‌లో ట్రాన్స్‌కో ఏడీఈ రమేష్, సబ్ ఇంజినీర్ పాండులు ఏసీబీకి చిక్కారు. సోలార్ ప్యానెల్ అనుమతి కోసం కిషోర్ అనే వ్యక్తి వద్ద రూ. 3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా గోషామహల్ వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ అహ్మద్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బకాయి జీతం ఇచ్చేందుకు కింది ఉద్యోగి వద్ద లంచం డిమాండ్ చేశాడు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నాగయ్య ఇంటి నిర్మాణం అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రైడ్ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.

3472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles