ప్రభుత్వ నిధులు కాజేసిన ముగ్గురు అరెస్టు

Mon,April 22, 2019 09:51 PM

ఖమ్మం : ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసి నిరుద్యోగులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నగర ఏసీపీ వెంకట్రావు వివరాలు వెల్లడించారు. ఖమ్మం నగరానికి చెందిన వేముల సునీల్‌కుమార్ 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన లబ్ధిదారుల జాబితాను తీసుకుని అందులో 45 మందిని ఎంపిక చేసుకొని వారికి నేరుగా ఫోన్ చేసి తానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పరిచయం చేసుకుని నమ్మించాడు. లబ్ధిదారులకు రుణాలు ఎక్కువగా మంజూరు కావాలంటే తమకు ముందుగా కొంత మొత్తం నగదు చెల్లించాలని సూచించాడు.


అందులో 21 మంది లబ్ధిదారులు సునీల్ మాటలు నమ్మి రూ.5,38, 500ల నగదును ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్, రుణాలకు కోటేషన్లు అందించే ప్రైవేటు వ్యక్తి భానుప్రసాద్ సహకారంతో దొంగ డాక్యుమెంట్లను సృష్టించారు. 43 యూనిట్లకు రూ.2కోట్ల 92లక్షల 50వేల నగదును హవాల మార్గంలో వేర్వేరు ఖాతాల్లోకి రుణాల నగదును మళ్లించారు. ఈ పెద్ద మొత్తానికి లబ్ధిదారులకు వారు ఏర్పాటు చేయాల్సిన యూనిట్లకు సంబంధించిన వస్తువులు ఇవ్వకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మంజూరైన రుణంలో రూ కోటి 28 లక్షల సబ్సీడి నగదును బ్యాంకు అధికారులు మంజూరు చేయడం జరిగిందని ఆ నగదును తమకు సంబంధించిన వ్యక్తుల ఖాతాలలో వారు మళ్లించారు. అనంతరం లబ్ధిదారులు తమ రుణాల కోసం వారి చుట్టూ ఎన్ని సార్లు తిరిగినప్పటికి వారికి చెందాల్సిన సబ్సీడి, బ్యాంకు రుణాలు ఇవ్వకుండా ఏయిర్ గన్‌తో బెదిరింపులకు పాల్పడినాడు.

దీంతో విసుగు చెందిన లబ్ధిదారులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. సోమవారం వేముల సునీల్‌కుమార్ రెండో పట్టణ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న ఏపీ10ఏడబ్ల్యూ 8388 నెంబర్‌గల పార్చనర్ కార్, 3 ఎయిర్‌గన్స్, ఇతర దస్తావేజులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న భానుప్రసాద్, సురేష్‌లను అరెస్టు చేసినట్లు ఎసీపీ తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు.

2037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles