అమీన్ పూర్ లో వేలాది చేపలు మృత్యువాత

Mon,June 3, 2019 05:50 PM

Thousands of fishes dies in AMEENPUR shambhuni kunta


సంగారెడ్డి: పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శంభుని కుంటలో వేలాది చేపలు మృత్యువాతకు గురయ్యాయి. కుంటలోకి కలుషిత నీరు చేరడంతో చేపలు మృతి చెందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ కుంటలో పెద్ద ఎత్తున చేపలు చనిపోవడంతో చుట్టూ ఉన్న కాలనీలు దుర్గంధంతో నిండి పోతున్నాయి. మరోవైపు గత నాలుగు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూడా చేపలు మృతి చెంది ఉంటాయని పరిసర ప్రాంతాల కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు.

కుంటలో చనిపోయిన చేపల విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందని చేపల వ్యాపారులు వెల్లడించారు. దుర్గంధం, దుర్వాసన, కలుషిత నీటితో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి ఈ కుంటను శుద్దిచేయాలని స్థానికులు విజ్తిపి చేస్తున్నారు.1844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles