రూ. కోటి విలువ చేసే గంజాయి స్వాధీనం

Thu,April 18, 2019 01:15 PM

thousand kgs Cannabis seize at Panthangi Toll Plaza

హైదరాబాద్‌ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద డీసీఎం వ్యానులో తరలిస్తున్న గంజాయిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు హైదరాబాద్‌ డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. డీసీఎం వ్యానులో ఇటుకల మధ్య గంజాయిని ఉంచి తరలిస్తుండగా పోలీసులు, అధికారులు పట్టుకున్నారు. రూ. 1,68,22,500 విలువ చేసే 1121.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజాయిని తరలిస్తున్న వాహన నెంబర్‌ - ఎంహెచ్‌ 13 ఆర్‌ 4039.

834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles