టీఆర్‌ఎస్‌లోకి తొర్రూరు కాంగ్రెస్ కార్యకర్తలు

Tue,September 18, 2018 06:13 PM

Thorrur congress workers joined in TRS party

మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, గౌడ కులస్తులు భారీ సంఖ్యలో మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వీరందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ బీసీలకు పెద్దపీట వేసి అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నరన్నారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగడానికి రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేయాలని.. పాలకుర్తి గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పేర్కొన్నారు.

1827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS