ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు!

Sun,September 9, 2018 10:56 PM

- జనగామ జిల్లా కోమళ్ల వాసి వినూత్న ప్రచారం
-ఆలోచింపజేస్తున్న వాల్ రైటింగ్

జనగామ: అసెంబ్లీకి వచ్చిన ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓ వ్యక్తి తన ఇంటి గోడపై రాయించిన పెయింటింగ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటస్వామి 'ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు' అని తన ఇంటి గోడకు రాయించాడు. దీంతో పాటు 'నా జాతి ప్రజలకు కత్తి చేతికివ్వలేదు.. ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను.. పోరాడి రాజులౌతారో.. ఓడిపోయి (అమ్ముడుపోయి) బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది' అన్న అంబేద్కర్ మాటలను కూడా పెయింటింగ్ వేయించాడు. ఈ వినూత్న ప్రచారం గ్రామస్తులు, యువతను అమితంగా ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తుండడం విశేషం. ఆ పెయింటింగ్ ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

6019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles