దీపావళి తర్వాత ఇంటి శుభ్రతకు..

Thu,November 8, 2018 10:42 PM

These steps to clean your home after Diwali

దీపావళి పండుగ లక్ష్మీ పూజతో మొదలై ముగ్గులు, దీపాలు, లైట్లు, టపాకులు పేల్చడంతో ముగుస్తుంది. గ్రాండ్‌గా జరుపుకున్న పండుగ అవ్వగానే ఇల్లు కాస్త పీకి పందిరేసినట్లుగా మారుతుంది. దీపావళి తర్వాత ఇంటిని శుభ్రపరుచడానికి ఈ చిట్కాలు మీ కోసం.
* ఇంటిముందు వేసిన ముగ్గును తీసేయ్యాలి. అలంకరణకు ఉపయోగించిన ఆకులు, పూలు, పేపర్లను తొలగించాలి. అన్నీ తీసేసిన తరువాత తడి బట్టతో ఇంటిని శుభ్రంగా తుడువాలి.
* ఇంట్లో శుభ్రం చేయాల్సిన ముఖ్యమైన ప్రదేశం వంటగది. పండుగ రోజు వంటగది వైరైటీస్‌తో నిండిపోతుంది. పాత్రలన్నింటినీ శుభ్రంగా కడుగాలి. ఎక్కడ ఉన్న వస్తువులను తిరిగి అక్కడికే చేర్చాలి. అప్పుడు ఇల్లు కొత్తగా కనిపిస్తుంది.
* లక్ష్మీపూజకి తయారవ్వడానికి కొత్త బట్టలు, ఆభరణాలు, మేకప్ వస్తువులు అన్నీ చిందరవందరగా పీకిపడేసుంటారు. దీపావళి తరువాత బట్టలు ఉతికి ఆరబెట్టడం మంచిది. ఆభరణాలన్నింటినీ తీసి సర్దుకోవాలి.
* పండుగ సందర్భంగా ఫర్నీచర్, వస్తువులు మీద దుమ్ము, ధూళి అంటుకుని ఉంటుంది. దీపావళి తరువాత కాటన్ బట్టతో టేబుల్స్, ఫ్యాన్స్, ఫర్నిచర్‌ను శుభ్రం చేసుకోవాలి.
* దీపావళి తరువాత బెడ్ షీట్స్, బెడ్ కవర్స్, కర్టెన్స్, సోఫా కవర్స్ మొత్తం మార్చుకోవాలి. దాంతో ఇల్లు తిరిగి కొత్తగా కనిపిస్తుంది.
* అన్నీ పనులు అయ్యాక కాటన్ బట్టను ఫినాయిల్ నీటిలో ముంచి, ఇంటిలోని అన్ని గదులను శుభ్రం చేయాలి.

1900
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles