ఐటీ దాడులతో రాష్ర్ట ప్రభుత్వానికి సంబంధం లేదు: ఎంపీ కవిత

Thu,September 27, 2018 06:40 PM

There is no state govt involvement in IT raids on Revanth reddy

నిజామాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇండ్లపై జరుగుతున్న ఐటీ దాడుల అంశం రాష్ర్ట ప్రభుత్వానికి సంబంధం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఎంపీ కవిత.. రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల అంశంపై ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. ఇటు రేవంత్‌రెడ్డి అంశం గానీ అటు జగ్గారెడ్డి అంశంపై చర్యలు గానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివని ఆమె పేర్కొన్నారు. అక్రమార్జన, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే ఫిర్యాదుపై ఐటీ శాఖ రేవంత్‌రెడ్డి ఇండ్లలో సోదాలు చేపట్టింది. కాగా ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించి తన కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్టులు పొందిన కేసులో అమెరికన్ కాన్సులేట్ అధికారుల ఫిర్యాదు మేరకు జగ్గారెడ్డిపై పోలీస్‌శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలు కేంద్రం పరిధిలోనివని రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ కావాలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురద జల్లుతుందన్నారు.

2306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles