రైళ్లలో ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి..

Wed,June 12, 2019 07:46 AM


Thefts after giving Anesthesia to rail passengers

హైదరాబాద్ : రద్దీగా ఉన్న రైళ్లను ఎంచుకొని మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి కి రైల్వే కోర్టు 20 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ ఎర్నా కథనం ప్రకారం.. బీహార్‌ రాష్ర్టానికి చెందిన మహ్మద్‌ ముస్తాకీన్‌ ఖాన్‌(36) సెల్‌ఫోన్లు విక్రయిస్తూ బంజారాహిల్స్‌లో నివాసముంటున్నాడు. ఇతను రైళ్లలో ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి దోచుకు౦టున్నాడు.

కాగా..వరంగల్‌ జిల్లాకు చెందిన సామల రవికుమార్‌ బెంగళూర్‌ వెళ్లడానికి 12 సెప్టెంబర్‌ 2016న కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కాడు. మహ్మద్‌ ముస్తాకీన్‌ రవికుమార్‌తో మాటలు కలిపి వా టర్‌ బాటిల్‌ మత్తుమందు ఇచ్చి ఆతని మెడపై ఉన్న 2.50 తులాల బంగారు గొలుసు, 2 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ తీసుకుని, 3 ఏటీఎం కార్డుల నుంచి రూ.30 వేలను డ్రా చేసుకున్నాడు. మత్తు దిగిన అనంతరం రవికుమార్‌ కాచిగూడ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు ముస్తాకీన్‌ ఖాన్‌ను 29 అక్టోబర్‌ 2017న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం రైల్వే కోర్టులో హాజరుపర్చగా 6వ అదనపు మెట్రోపాలిటన్‌ న్యాయమూర్తి నిజామోద్దీన్‌ నిందితుడైన మహ్మద్‌ ముస్తాకీన్‌కు 20 నెలల కఠిన కారాగార శిక్ష విధించారు.

3881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles