రెండు ఇళ్లలో చోరీ..రూ.5 లక్షల సొత్తు అపహరణ

Mon,April 15, 2019 09:18 PM

Theft in two homes at sunday midnight


ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో నిన్న అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. ఆరుబయట నిద్రిస్తున్న వారి రెండు ఇండ్లలోకి చొరబడిన దొంగలు నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఏఎస్సై హుస్సేన్‌ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మారం వెంకటరెడ్డి, ఎర్రా సంజీవరెడ్డి కుటుంబసభ్యులంతా బయట పడుకున్నారు. ఇవాళ తెల్లవారు జామున లేచి చూసే సరికి ఇంటి తలుపులు తొలగించి, ఇంట్లో బీరువాలోని సామాన్లు చెల్లా చెదురుగా పడి ఉన్నట్లు చూశారు. దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఎర్రా సంజీవరెడ్డి ఇంట్లో రూ.1.43 లక్షల నగదు, 10తులాల బంగారం, పలు వెండి వస్తువులు, మారం వెంకటరెడ్డి ఇంట్లో రూ.16వేల నగదు, రెండు తులాల బంగారం, ఒక సెల్‌ఫోన్‌ను చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.

637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles