ఓవరాల్ చాంపియన్ 'తెలంగాణ'

Sun,January 20, 2019 09:56 PM

The overall champion is Telangana

కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో జరుగుతున్న జాతీయస్థాయి కరాటే పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. కాంటినెంటల్ షోటోకాన్ డో ఇండియా (సీఎస్‌కేఐ) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన పోటీల్లో రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి 167 పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. 156 పతకాలతో ఆంధ్రప్రదేశ్ ద్వితీయస్థానం, 122 పతకాలతో హర్యానా తృతీయస్థానం, 101 పతకాలతో తమిళనాడు 4వ స్థానంలో నిలిచాయి. ఈ పోటీల్లో 20 రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు సీఎస్‌కేఐ చైర్మన్ చల్ల హరిశంకర్, డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, సీఎస్‌కేఐ ఇండియా చీఫ్ ఈ శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్ బహుమతులను ప్రదానం చేశారు.

1151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles