టీఆర్‌ఈఐఆర్బీ లెక్చరర్ దరఖాస్తు గడువు పెంపు

Wed,September 12, 2018 07:48 AM

The Last Date Extended for fee payment receving applications for Jr Lecturer and Degree lecturer posts

హైదరాబాద్ : టీఆర్‌ఈఐఆర్బీ (తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు) ప్రకటించిన జూనియర్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు, డిగ్రీ లెక్చరర్ల దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్టు బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలని తమకు వచ్చిన అభ్యర్థనల మేరకు గడువు పొడిగించినట్టు తెలిపారు.

18న ఈవో గ్రేడ్ 1 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
స్త్రీ, శిశు సంక్షేమశాఖలోని ఈవో గ్రేడ్ 1 అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 18న పరిశీలించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ జాబితాను తమ వెబ్‌సైట్లో పొందుపరిచామని, అభ్యర్థులు హాజరుకావాలని కోరింది.

2275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles