పిండివంటలు భలే రుచిగా ఉన్నాయి: మాజీ ఎంపీ కవిత

Sat,November 9, 2019 06:16 PM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా, కమ్మరపల్లి మండల సమాఖ్య పరిధిలోని నర్సాపూర్ గ్రామ సమాఖ్య ద్వారా తయారు చేస్తున్న పిండివంటలు భలే రుచిగా ఉన్నాయని మాజీ ఎంపీ కవిత అన్నారు. వడ్డీలేని రుణాల కింద రూ. 619 కోట్లు మంజూరు చేసినందుకు, అందుకు మూల కారకులైన మాజీ ఎంపీ కవితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు శనివారం సెర్ప్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి విచ్చేశారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపిన వారు.. పూలు, బొకేలకు బదులుగా వారు తయారుచేసిన పిండివంటలు ఆమెకు బహూకరించారు. వాటి రుచి చూసిన ఆమె.. భలే రుచిగా ఉన్నాయని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాలు చేపట్టే ఆదాయ వృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు వడ్డీలేని రుణాల కింద ప్రభుత్వం రూ. 619 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మహిళల సంక్షేమం, సెర్ప్ సిబ్బంది సంక్షేమం ప్రభుత్వం భాద్యత అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నరసయ్య, సుదర్శన్, సుభాష్‌గిరి, రాజారెడ్డి, వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

1705
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles