ఆస్తి పిల్లల పేరు మీద రాసే వరకు దహన సంస్కారాలు చేయం

Sun,June 3, 2018 05:13 PM

The cremation will not be done until the property is written on the childs name

కరీంనగర్: గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఓ బాధిత మహిళ కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం స్వప్న అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త, మామల వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు మహిళ లేఖలో పేర్కొంది. వరకట్న వేధింపులు తాళలేక స్వప్న ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి అత్తింటి ఎదుట మృతదేహంతో స్వప్న బంధువులు ఆందోళన చేస్తున్నారు. స్వప్న భర్త, అత్త, మామలను అరెస్ట్ చేసి పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్తి ఇద్దరు ఆడపిల్లల పేరు మీద రాసే వరకు దహన సంస్కారాలు చేయబోమని బంధువులు ఆందోళన చేస్తున్నారు.

7347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles