ఆక్టివాను ఢీకొట్టిన కారు..

Thu,October 10, 2019 10:35 AM

మర్రిగూడ: నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం, యరుగండ్లపల్లి సమీపంలో ఓ కారు యాక్టివా బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పైనున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనున్న భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిరువరి కాళ్లు విరిగి, తీవ్ర రక్త స్రావమవగా.. వారిని 108 అంబులెన్సులో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

67162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles