స‌భ‌ను విజయవంతం చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృతజ్ఞతలు

Mon,September 3, 2018 04:20 PM

Thanks to everyone succeed for TRS Meeting minister indrakaran reddy

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయింద‌ని రాష్ట్ర గృహ నిర్మాణ‌,న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులు సభ సక్సెస్‌కు బాగా కష్టపడి పనిచేశారని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపును అందుకొని లక్షలాదిగా తరలివచ్చిన జనం కనీవినీ ఎరుగని రీతిలో సభను విజయవంతం చేశారన్నారు.

నాలుగున్న‌ర ఏళ్ల‌లో టీఆర్ఎస్ పార్టీ చేసిన‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకునేందుకు వచ్చిన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నేత‌లకు, నిర్మ‌ల్ నియోక‌వ‌ర్గ‌ క్రియాశీల కార్యకర్తలకు ఐకే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను సూప‌ర్ స‌క్సెస్ చేసేందుకు శ్రమించిన ఇన్‌చార్జీలు, వాలంటీర్లు, సభా వేదిక, ప్రాంగణం, పార్కింగ్.. ఇలా అన్ని కమిటీలవారికి అధినేత సీయం కేసీఆర్ తరపున కృతజ్ఞతలు చెప్పారు.

మ‌రోవైపు ప్ర‌గ‌తి నివేద‌న స‌భ సూప‌ర్ స‌క్సెస్ కావ‌డంతో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందన్నారు.సీయం కేసీఆర్ కున్న ప్ర‌జాధ‌ర‌ణ‌ను చూసి కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఓర్వ‌లేక‌పోతున్నార‌ని, ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌పై ఆ పార్టీ నేతలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. తెలంగాణ‌ ప్రజలు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఆ పార్టీకి బుద్ధి చెప్పి, టీఆరెస్ కు భారీ మెజారిటీతో మ‌ళ్లీ పట్టం కట్టి తీరుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

1584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles