ఆకాశవాణిలో తాత్కాలిక ఉద్యోగాలు

Tue,December 3, 2019 10:19 PM

హైదరాబాద్ : ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు (తెలుగు), న్యూస్‌రీడర్ల (తెలుగు, ఉర్దూ) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఉప సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో నివసించేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. న్యూస్‌రీడర్లు ఆడిషన్ (వాయిస్ టెస్ట్)లో కూడా ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు 16వ తేదీ వరకు గడువు ఉన్నదని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.newsonair.com వెబ్‌సైట్‌లో వేకెన్సీ విభాగాన్ని పరిశీలించాలని కోరారు.

881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles