సీఎం కేసీఆర్‌కు గుడి కట్టిన కానిస్టేబుల్

Fri,September 21, 2018 07:05 PM

Temple for cm kcr in nalgonda district

నల్లగొండ: రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై ఓ కానిస్టేబుల్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం కేసీఆర్‌కు గుడి కట్టి తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సీఎం కేసీఆర్ పాలనకు ముగ్ధుడైన శ్రీనివాస్ గుడి కట్టి తన అభిమానాన్ని చాటాడు. సీఎం కేసీఆర్ నాలుగున్నర ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి సాధించిందన్నారు. గత 60 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఈ నాలుగున్నరేండ్ల పాలనలో జరిగిందన్నారు.

10139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles