రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Wed,March 20, 2019 07:42 PM

temperatures increased in Telangana state

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మఖ్దుంపూర్‌లో బుధవారం అత్యధికంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని జుక్కల్‌లో 38.9 డిగ్రీలు, బిచ్కుందలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌లో 39.2 డిగ్రీలు, ఉండవెల్లి మండలం పుల్లూరులో 38.8 డిగ్రీలు, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం చిన్నమావందిలో 39.1 డిగ్రీలు, నవీపేటలో 38.8 డిగ్రీలు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడలో 38.9 డిగ్రీలు, కొత్తకోట మండలం మిరాస్‌పల్లెలో 38.8 డిగ్రీలు, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

1511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles