త్వరలో తెలుగు యూనివర్సిటీ ఎంఫిల్ నోటిఫికేషన్

Sat,January 5, 2019 07:02 AM

హైదరాబాద్ : తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా 2018-19 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్‌ను డిసెంబర్ 31వ తేదీనే విడుదల చేయాలని వర్సిటీ అధికారులు భావించారు. అయితే యూజీసీ నిబంధనల్లో మార్పులు కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. యూజీసీ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఎం ఫిల్ ప్రవేశాలకు ఒకేరకమైన నిబంధనలు ఉండాలని భావించారు. ఈ క్రమంలో ఎంఫిల్ ప్రవేశాలకు సంబంధించి గైడ్‌లైన్స్‌ను అన్ని యూనివర్సిటీలకు కామన్‌గా ఉండాలనే విషయంపై శనివా రం ఉన్నత విద్యామండలిలో నిర్ణయించనున్నారు. అందులో భాగంగానే ఎంఫిల్‌కు ప్రవేశాలకు ప్రవేశపరీక్ష ఉంటుందా? నెట్, సెట్, జేఆర్‌ఎఫ్ ప్రాతిపదికగా సీట్లు ఇవ్వాలనే అనే అంశం తేలనుంది. మొత్తంగా శనివారంతో ఎంఫిల్ ప్రవేశాలకు సంబంధించి స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ ప్రకటన విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

1054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles