రంగస్థల యువ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

Thu,March 14, 2019 09:04 AM

telugu university Invitation applicants for theatrical youth award

తెలుగుయూనివర్సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రంగస్థల కళల శాఖ మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా జె.ఎల్ నరసింహారావు పేరున ఏర్పాటు చేసిన యువ పురస్కారానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్ల్లు రిజిస్ట్రార్ అలేఖ్య ఒక ప్రకటనలో తెలిపారు. నాటక రంగంలో వివిధ రంగాలలో నటన, దర్శకత్వం, మేకప్, లైటింగ్, సెట్ తదితర సాంకేతిక అంశాల్లో కృషి చేస్తున్న 35 సంవత్సరాల లోపు యువతీ, యువకులు ఈ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు. పోస్టు ద్వారా కాని, స్వయంగా కాని సంబంధిత వివరాలతో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles