తెలుగు భాష తప్పనిసరి : సీఎం కేసీఆర్

Tue,March 20, 2018 05:04 PM

telugu language mandatory in all govt and private schools says CM KCR

హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం(2018-19) నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తమిళనాడులో మాతృభాష బోధన విధానాన్ని అధ్యయనం చేసిన అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధివిధానాలపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తెస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. మొదటి దశలో పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. తెలుగు సబ్జెక్ట్‌కు సిలబస్ రూపొందించాలని తెలుగు యూనివర్సిటీ, సాహిత్య అకాడమీలను సీఎం కేసీఆర్ కోరారు.

4177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles