తెలుగు భాష గొప్ప సంపద : గవర్నర్ నరసింహన్

Tue,December 19, 2017 08:12 PM

Telugu Language is Great Asset says Governor Narasimhan

హైదరాబాద్ : తెలుగు భాష గొప్ప సంపద.. ఆ భాషను కాపాడుకోవాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఐదు రోజుల పాటు తెలుగు మహాసభలు అత్యంత వైభవోపేతంగా జరిగాయని ప్రశంసించారు. తెలుగు భాషాభిమానులతో బమ్మెర పోతన ప్రాంగణం పులకించిందని కొనియాడారు. ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయన్నారు. భాషా పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న వారందరికీ గవర్నర్ అభినందనలు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి తల్లిదండ్రులందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పిల్లల పుట్టిన రోజున తల్లిదండ్రులు తెలుగు పుస్తకం బహుకరించండి అని సూచన చేశారు. మాతృవికాసం కుటుంబం నుంచే ప్రారంభం కావాలని అన్నారు. తెలుగు భాషాభివృద్ధిలో మీడియా ముఖ్య పాత్ర పోషించాలని నరసింహన్ సూచించారు. మహాసభలను విజయవంతం చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి గవర్నర్ అభినందనలు తెలిపారు.

2454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles