లండన్‌లో ‘తెలంగాణకు హరితహారం’పై అవగాహన కార్యక్రమం

Thu,August 10, 2017 09:19 PM

Telanganaku haritha haram in london by trs nri cell uk


హైదరాబాద్: లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ (యూకే) ఆధ్వర్యంలో "తెలంగాణకు హరితహారం' పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ యూకే సభ్యులు మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన మూడో విడత హరితహారంలో భాగంగా ప్రజలంతా మొక్కలు నాటాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ అటవీ పాలసీ కింద పర్యావరణ స్థిరత్వం, పర్యావరణ సంతులనం కొనసాగించటానికి మొత్తం భూమి విస్తీర్ణంలో కనీసం 33 శాతం అడవులుండాలని, సమస్త జీవరాశి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ యూకే సభ్యులు అన్నారు. రాష్ట్రప్రభుత్వం మొత్తం విస్తీర్ణంలో 33 శాతం అడవులను పెంచేందుకు ‘తెలంగాణకు హరిత హారం’ను ముందుకు తీసుకొచ్చిందని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్‌గౌడ్ దూసరి, నవీన్‌రెడ్డి, ఇతర సభ్యులు, తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్‌రావు బాలమూరి, జాగృతి నాయకులు లండన్ గణేశ్, వంశీ సముద్రాల, టాక్ సభ్యులు రాకేష్ వాకా తదితరులు పాల్గొన్నారు.
london-trsnri1
london-trsnri2

1514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles