రైతు సంక్షేమంలో తెలంగాణ మేటి: ఎంపీ బడుగుల లింగయ్య

Fri,July 19, 2019 08:39 PM

telangana was a farmer welfare state says badugula lingaiah

ఈరోజు రాజ్యసభలో రైతు సమస్యల పరిష్కారం కొరకు ప్రవేశపెట్టిన రాష్ట్రీయ కిసాన్ ఆయోగ్ ప్రైవేట్ బిల్ ను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కొరకు అమలుచేస్తున్న వివిధ పథకాల రాజ్యసభలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడారు.

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతే రాజు, దేశానికి వెన్నుముక అని మాటలకే పరిమిత మైంది తప్ప, ఈ ప్రభుత్వాలు రైతు ఆకలి చావులు, ఆత్మహత్యలు ఆపలేక పోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ దేశంలో ఎనభై వేల టీఎంసీల సాగునీరు అందుబాటులో ఉన్న కేవలం నలభై వేల టీఎంసీలు మాత్రమే ఉపయోగిస్తూ మిగతా సాగునీరు సముద్రంలో కలుస్తున్న ఈ ప్రభుత్వాలు వాటి వాడకనికి సరైన ప్రణాళికలు అమలు చేయడం లేదన్నారు.

ఈ దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే స్వామినాథన్ కమిషన్ సూచనలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కొరకు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడ అమలుచేయని అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారు. రైతు బంధు, రైతు భీమా, లక్ష రూపాయల రుణమాఫీ, ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నారని పేర్కొన్నారు.

అంతేగాక రైతు మద్ధతు ధర కొరకు 19.5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మాణం చేసి, రైతులు తమ పంటకు మద్దతు ధర వచ్చేంత వరకు ఉచితంగా నిల్వ చేసుకొనుటకు అవకాశం కల్పించారని అన్నారు. మిషన్ కాకతీయ పతకం పేరుతో నలభై వేల చెరువులను పునరుద్ధరణ చేసి సాగునీరు అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.

ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన రైతులకులకు తొంబై శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, మిగతా వ్యవసాయ పరికరాలను అందిస్తుంది అని అన్నారు. నిరంతరం సాగునీటి కష్టాలూ లేకుండా బహుళార్ధక ప్రాజెక్టులు ఉండాలని లక్ష కోట్ల వ్యయంతో, యాభై లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించుటకు "కాళేశ్వరం" అనే అద్భుత ప్రాజెక్టు ను మూడు సంత్సరాల వ్యవధిలోనే పూర్తి ఈ దేశంలోనే ఘనత సాధించింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మన్ యోజన పథకం క్రింద ఇస్తున్న నగదు ఆరువేల రూపాయలను పదిహేను వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.

660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles