ఏప్రిల్ 1వ తేదీ నుంచి షోరూంలలో వాహన రిజిస్టేషన్లు

Sat,March 16, 2019 07:50 AM

telangana Vehicle registration in the showroom from 1st April 2019

హైదరాబాద్ : వాహన రిజిస్ట్రేషన్ల బాధ్యతను షోరూంలకు అందజేసే ప్రక్రియపై అధ్యయనం చేసేందుకు నియమించిన బృందాలు రాష్ర్టాల్లో పర్యటించి నివేదికను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. ఈ నెల 13,14 తేదీల్లో అక్కడ రాష్ర్టాల్లో వాహన రిజిస్ట్రేషన్ల తీరును పరిశీలించి నివేదిక ఇవ్వాలని అదేశాలు అందడంతో అధ్యయనం చేసి ఉదయం నగరానికి చేరుకున్నారు . ఏప్రిల్ నుంచి హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు(హెచ్‌ఎస్‌ఆర్‌పీ) బిగింపు ప్రక్రియతోపాటు వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లు అప్పజెప్పాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి ఉత్తర్వులు అందడంతో సాధ్యాసాధ్యాలను నిర్ణయించేందుకు అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1,2019 నుంచి అమల్లోకి తేవాలని తెలంగాణ రవాణాశాఖ సిద్ధమైంది. అయితే సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నలుగురు అధికారులతో కమిటీ వేయగా ఆరు రోజుల క్రితం నివేదికను అందజేశారు. అధ్యయనం కోసం ఐదు బృందాలు ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాల్లో పర్యటించి అక్కడ అమలులో ఉన్న షోరూంలో రిజిస్ట్రేషన్ల విధానాన్ని పరిశీలించారు.. అధ్యయన బృందంలో నగరానికి చెందిన రవాణాశాఖ సూపరిండెంట్ స్థాయి అధికారులు,ఎంవీఐలు ఉన్నారు.

3007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles