తెలంగాణ టీకా వాహనాలు ప్రారంభం

Sat,May 6, 2017 03:16 PM

Telangana Vaccine Vehicle inaugurates by Laxma reddy

హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన సదుపాయాలు కల్పిస్తూ.. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆరోగ్య తెలంగాణలో భాగంగా ఇంటింటికి వెళ్లి టీకాలు వేసేందుకు తెలంగాణ టీకా వాహనాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వాహనాల ప్రారంభ కార్యక్రమం కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో జరిగింది. పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టం పెరగాలని మంత్రి చెప్పారు. ఈ వాహనాల ద్వారా సిబ్బంది ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తుందని తెలిపారు. ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు.

1573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles