లక్షపదాలతో తెలంగాణ తెలుగు పదకోశం!

Fri,April 5, 2019 09:12 AM

Telangana Telugu Glossary with One lakh words says Telugu University VC Satyanarayana

హైదరాబాద్: లక్ష పదాలతో తెలంగాణ తెలుగు భాషా పదకోశం నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సాంస్కృతిక కేంద్రం సంయుక్తాధ్వర్యంలో గురువారం తెలంగాణ నిఘంటువు నిర్మాణం అనే అంశంపై జరిగిన కార్యగోష్ఠిలో అధ్యక్షోపన్యాసం చేశారు. తెలంగాణ భాషా నిఘంటువు నిర్మాణాన్ని దశలవారిగా సమగ్ర రూపకల్పన చేశామని, జూన్ 2 వరకు లక్షపదాలతో పదకోశాన్ని తెలంగాణ ప్రజలకు అందిస్తామని ప్రకటించారు. కార్యగోష్ఠిలో ఆచార్య భట్టు రమేశ్, బాలశ్రీనివాసమూర్తి, హెచ్ రమేశ్‌బాబు, సోమిరెడ్డి నర్సింహారెడ్డి, బుచ్చయ్య, మేడి భద్రయ్య, భూతం ముత్యాలు, శివకుమార్, మల్లికార్జునశర్మ తదితరులు పాల్గొన్నారు.

789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles