ఆంధ్రా కోవర్టులుగా టీటీడీపీ నేతలు

Fri,November 9, 2018 06:04 PM

Telangana TDP leaders acts as Andhra coverts says mlc karne prabhakar

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలు ఆంధ్రా కోవర్టులుగా మారారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసింది చంద్రబాబేనన్నారు. ప్రపంచానికి చంద్రబాబు కుట్రలు తెలిసేందుకే ప్రశ్నలు వేశామన్నారు. రేవూరి ప్రకాష్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు ఆంధ్రా కోవర్టులుగా పని చేస్తున్నరని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన 30 లేఖలను వెనక్కి తీసుకుంటామని టీడీపీ నేతలు చెప్పించగలరా అని ప్రశ్నించారు. ఏపీకి కేటాయించిన భవనాలు తెలంగాణకు ఇస్తామని చంద్రబాబుతో జీవో ఇప్పించగలరా అన్నారు. కొన్ని సీట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని టీడీపీ నేతలు తాకట్టు పెట్టిన్రు. టీడీపీ నేతల డొంక తిరుగుడు సమాధానాలకు ప్రజలే బుద్ది చెప్తరని పేర్కొన్నారు.

1616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles