వసతిగృహాలకు సౌర సొబగులు

Tue,June 26, 2018 09:06 AM

Telangana state social welfare hostels get solar panels

హైదరాబాద్ :టీఆర్‌ఎస్ ప్రభత్వం వసతిగృహాలకు సన్నబియ్యం, మాంసాహారం అందిస్తున్న విద్యార్థులు చీకట్లో మగ్గకుండా సౌర విద్యుత్ అందించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ షెడ్యూల్ కులాల విద్యార్థుల వసతి గృహాల్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. వివరాల్లోకి వెళితే... వసతిగృహా విద్యార్థులకు చదువుకు ఇబ్బంది కలుగకుండా వసతిగృహాలకు సౌర విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. నిధులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్టల్ పైభాగంలో సోలార్ ప్యానల్ బిగించారు. దీంతో ఆయా వసతిగృహాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. మెదక్ జిల్లాలోని 28 షెడ్యుల్ కులాల వసతిగృహాలను ఎంపిక చేశారు.

ఒక్క వసతిగృహానికి రూ. 2.70లక్షలు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తం గా 28 వసతిగృహాలకు గాను 24 వసతిగృహాల్లో సోలార్ ప్యానళ్లు బిగించగా పనిచేయడం ప్రారంభమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన నాలుగు వసతిగృహాల్లో సైతం సోలార్ ప్యానళ్ల్లు బిగిస్తున్నాం. జిల్లాలోని పాపన్నపేట, టేక్మాల్, చీకోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రామాయంపేట, చేగుంట, వడియారం, తూప్రాన్, కౌడిపల్లి, వెల్మకన్నె, నర్సాపూర్ తదితర వసతిగృహాలు సోలార్ ప్యానల్ బిగించడానికి ఎంపికయ్యాయి.

వీటిద్వారా ఆయా వసతిగృహాల పైకప్పులపై ఈ ప్యానల్ బిగించారు. వీటికి రెండుకిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. వీటిద్వారా నిత్యం 8యూనిట్ల కరెంట్ ఉత్పత్తి కాగా రోజు 9 గంటల పాటు పదిఫ్ల్యాన్లు, పది ట్యూబ్‌లైట్లు పనిచేయనున్నాయి. అయితే ఇందుకు అవసరమయ్యే నిధులను 70శాతం వరకు తెలంగాణ రెడ్‌కో భరించగా మరో 30శాతం మేర కలెక్టర్ ఫండ్స్‌నుంచి వినియోగిస్తున్నారు.

896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles