తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు 7 జాతీయ అవార్డులు

Tue,September 11, 2018 06:14 PM

telangana state rural development department bags 7 national awards

న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల్లో ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఏడు జాతీయ అవార్డులు లభించాయి. ఈ అవార్డులను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్‌లో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రదానం చేశారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖ అధికారులు కలిసి ఈ అవార్డులను అందుకున్నారు.

1."పారదర్శకత మరియు జవాబుదారీతనం" కేటగిరి కింద ప్రధానం చేసిన మూడు అవార్డులలో తెలంగాణ రాష్ర్టానికి ప్రధమ స్థానం లభించినది. దీనిని నీతూ ప్రసాద్, సైదులు అందుకున్నారు.

2. ఉపాధి హామీ అమలు పథకం, సుపరిపాలన కార్యక్రమాల విభాగములో ద్వితీయ స్థానం లభించింది. ఈ అవార్డును నీతూ ప్రసాదు ఐ‌ఏ‌ఎస్, సైదులు అందుకున్నారు.

3. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలులో అత్యుత్తమ పురస్కారం కింద దేశంలో 2 రాష్ట్రాలలో ఒక రాష్ట్రముగా తెలంగాణ నిలిచినది. దీనిని నీతూ ప్రసాద్, ఐ‌ఏ‌ఎస్, ఎస్.జే ఆశ ఐ‌ఎఫ్‌ఎస్ అందుకున్నారు.

4. ఉపాధి హామీ అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లాల విభాగంలో దేశ స్థాయిలో 18 అవార్డులను ప్రదానం చేయగా అందులో తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. అవి వికారాబాద్ జిల్లా నుండి సయ్యద్ ఒమర్ జలీల్ ఐఏఎస్, పి.డబ్ల్యూ.జాన్సన్, డీఆర్‌డీఓ అందుకున్నారు. కామరెడ్డి జిల్లా తరపున జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, డీఆర్డి‌ఓ. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ చేతుల మీదగా అవార్డులను అందుకున్నారు.

5. స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్(ఎస్‌ఐ‌ఆర్‌డీ) గ్రామీణ జిల్లాలలో సమర్థంగా పని చేసి శిక్షణ అమలు చేసినందులకు గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును పౌసుమీ బసు ఐఏఎస్, కమీషనర్ ఎస్‌ఐ‌ఆర్‌డీ అందుకున్నారు.

6. ఉపాధి హామీ అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామపంచాయతీలలో 18 గ్రామ పంచాయితీలకు దేశ స్థాయిలో అవార్డులను ప్రదానం చేశారు. అందులో ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీ, సిద్దిపేట జిల్లాకు అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆ గ్రామ పంచాయతీ లో క్షేత్ర సహాయకుడు ఆర్.రాజు, పంచాయతీ సెక్రెటరీ ఎం.జీవన్ రెడ్డి, ఎంపీడీఓ కే సమ్మి రెడ్డి అందుకున్నారు.

7. ఉపాధి హామీ కూలీలకు సకాలంలో నగదు చెల్లింపులు చేసిన విభాగంలో 18 అవార్డులను ప్రదానం చేశారు. అందులో శాప మానయ్య, బీపీఎం మక్త లక్ష్మాపూర్, శంకరంపేట ఎస్ఓ మెదక్ జిల్లా అందుకున్నారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధి స్టేట్ ప్రోగ్రాం మేనేజర్లు దుర్గా ప్రసాద్, శేషు కుమార్, మురళీధర్, లెంకలపల్లి కృష్ణ మూర్తి, జిల్లాల నుండి నర్సింగ రావు, రూర్బన్ నుంచి శేఖర్, నర్సింహులు తదితరులు హాజరయ్యారు.

2568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles