ఆదర్శ పాఠశాలలో దరఖాస్తు చేసుకునే విధానం ఇలా..

Tue,February 12, 2019 01:26 PM

హైదరాబాద్ : మోడల్ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం http://telanganams.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం జనరల్ విద్యార్థులు రూ.100, ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు రూ.50ఫీజు చెల్లించాలి. విద్యార్థి పాస్‌సైజ్ ఫొటో, స్టడీసర్టిఫికెట్, ఆధార్‌కార్డు తదితర ధృవీకరణ పత్రాలను తీసుకెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏ మండలంలో మోడల్ పాఠశాల ఉందో అదే మండలంలో అంతకు ముందు రెండు తరగతులు చదివిన విద్యార్థులు అర్హులవుతారు. లోకల్ విద్యార్థులు లేని పక్షంలో నాన్‌లోకల్ వారికి అవకాశం కల్పిస్తారు.

షెడ్యూల్ విడుదల..

మోడల్ పాఠశాలలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 28వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 8నుంచి13 వరకు హాల్‌టికెట్‌లు డౌన్‌లౌడ్‌లు చేసుకోవాలి. ఏప్రిల్ 13న పరీక్ష నిర్వహిస్తారు. 6వ తరగతి విద్యార్థులకు 13న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మే18న ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. మే 28నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికెట్లను పరిశీలించి అడ్మిషన్లు తీసుకుంటారు.

నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంగ్లిషు మీడియం విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆదర్శపాఠశాలలను ఏర్పాటు చేసింది. ఆయా పాఠశాలల్లో ఆదర్శమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అ న్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇదేకాక ఈ పా ఠశాలల్లో 6నుంచి10వ తరగతి, ఇంటర్మీడియట్ వరకు ఉన్న పాఠశాలల్లో అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో ప్రవేశాలకు విపరీతమైన పోటీ పెరిగింది.

మోడల్ పాఠశాలలో 2018-19విద్యాసంవత్సరానికి ఖాళీల వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ ప్రకటించారు. 6వ తరగతిలో 100సీట్లు, మిగతా 8నుంచి 10వరకు పాఠశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు.

పాఠశాల సదుపాయాలు..

విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంగ్లిషు మీడియం బోధన అందుబాటులో ఉంది. 6 నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్న భోజన వసతి ఉంటుంది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇస్తారు. డిజిటల్ తరగతులు, సైన్స్‌ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ సదుపాయాలు ఉన్నాయి.


ప్రవేశ పరీక్షలో100మార్కులు..

ఆదర్శ పాఠశాల ప్రవేశపరీక్ష విద్యార్థులకు 100మార్కులకు ఉంటుంది. విద్యార్థులు సీట్ల కో సం దరఖాస్తులు చేసుకునే ముందు తరగతి పా ఠ్యాంశాల సిలబస్‌పై పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్ట్‌కు 25మార్కుల చొప్పున తెలుగు, గణితం, ఈ వీఎస్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లు మొత్తం 100ప్రశ్నలకు 100మార్కుల పరీక్ష నిర్వహిస్తారు. పాఠశాలలో ఉన్న సీట్ల ప్రకారం మెరిట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయిస్తారు.

1719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles