క్రీడలతో ఆత్మైస్థెర్యం పెరుగుతుంది: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

Thu,November 22, 2018 09:23 PM

Telangana state level sport competitions in Tribal gurukula school gandhari

గాంధారి : విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు సైతం ఎంతో ముఖ్యమని గిరిజన గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదవు ఎంత ముఖ్యమో, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు అంతే ముఖ్యమని అని అన్నారు. క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యం పెరుగుతుందని, మానసికంగా దృఢంగా ఉండడంతో పాటు, ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తారని అన్నారు.

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, కష్టపడి చదువకొని ఉన్నత కొలువుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ గురుకుల పాఠశాలల్లో అన్ని రకాల వసుతలను కల్పిస్తోందని తెలిపారు. ఇటీవల వెయ్యి మంది రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించామని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదవుతో పాటు, క్రీడల్లో సైతం రాణించాలన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్, డిప్యూటీ సెక్రటరీలు విజయలక్ష్మి, నాగేశ్వర్‌రావు, డీటీడీవో జాదవ్ అంబాజీ, ఆర్‌సీవో వెంకటేశ్వర్లు, మాలావత్ పూర్ణ, ఎంఈవో సేవ్లానాయక్, ప్రిన్సిపాల్ అమర్‌సింగ్, తదితరులు ఉన్నారు.

858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles