గొప్ప సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ : ఈటల

Sat,December 16, 2017 02:27 PM

హైదరాబాద్ : గొప్ప భాష, ఆట, పాట, సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను వర్ణించలేము అని తెలిపారు. కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం ఉండాలని చెప్పారు. ఒక సిరా చుక్క ఎంతో మందిని కదిలిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ పాటలు, ఆటలు ప్రజల గుండెల్ని కదిలించాయని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సీఎం కేసీఆర్ తెలుగు భాషాభిమాని అని ఈటల రాజేందర్ చెప్పారు.

1976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles